రాష్ట్రంలో డ్రగ్స్ దందాపై పోలీసుల ఉక్కుపాదం

రాష్ట్రంలో డ్రగ్స్ దందాపై పోలీసుల ఉక్కుపాదం

హైదరాబాద్: రాష్ట్రంలో డ్రగ్స్ దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఫారెనర్స్ ని కంట్రోల్ చేసేందుకు  పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సిటీకి డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న డ్రగ్స్ పెడ్లర్లలో నైజీరియన్లే ఎక్కువగా ఉన్నారు. వారే కీరోల్ ప్లే చేస్తున్నారు. డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్లొచ్చిన తర్వాత కూడా తిరిగి అదే దందా చేస్తూ రాష్ట్రంలో ఉంటున్నారు. దీంతో పోలీసులు వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. డ్రగ్స్ విక్రయానికి పాల్పడిన వారిని డిపోర్టేషన్ మీద తిరిగి వారి దేశాలకు పంపంచేందుకు చర్యలు చేపట్టారు.