- వైఎస్సార్‌టీపీకి బైనాక్యులర్ గుర్తు
- కేటాయించిన ఎన్నికల సంఘం
- మరో సింబల్ ఇవ్వాలని ఈసీకి అప్పీలు
హైదరాబాద్, వెలుగు: వైఎస్సార్ తెలంగాణ పార్టీకి బైనాక్యులర్ గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆ పార్టీకి ఈసీ లేఖ పంపింది. దీనిపై స్పందించిన వైఎస్సార్టీపీ నాయకులు.. రూరల్ ప్రాంతాల్లో ఎక్కువగా బైనాక్యులర్ గుర్తు సాధారణ ప్రజలకు తెలియదని చెబుతున్నారు.
ఈ క్రమంలోనే బైనాక్యులర్ గుర్తు తమకు వద్దని, ఇతర ఫ్రీ సింబల్స్ ఏమైనా కేటాయించాలని కోరుతున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘంకు పార్టీ మళ్లీ అప్పీలు చేసుకుంది. ఈ అప్పీలులో భాగంగా 15 రకాల సింబల్స్‌ను ఈసీ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం.