
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్, నేషనల్ ఎగ్ కో–ఆర్డినేషన్ కమిటీ, ఇండియన్ పౌల్ట్రీ ఎక్యూప్ మెంట్ మాన్యుఫాక్చర్ అసోసియేషన్, పౌల్ట్రీ ఇండియా హైదరాబాద్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశాయి. అంగన్వాడీ పథకం కింద గుడ్ల సరఫరా కేవలం కొంత మంది మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్లకుండా ఆయన ఆపారని ప్రశంసించాయి. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకావాలని అధికారులను నియమించారని తెలిపాయి. అంగన్వాడీలకు గుడ్ల సరఫరా భవిష్యత్ లో తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ ద్వారా పౌల్ట్రీ చిన్న, సన్నకారు రైతుల ద్వారా జరగాలని ఆదేశించారని పేర్కొంది. ఆయన నిర్ణయం వల్ల పౌల్ట్రీ రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు కాసర్ల మోహన్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా ఉచితంగా గుడ్లు పంపిణీ చేశారు.