తెలంగాణ రాష్ట్ర పవర్ ఇంజినీర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రత్నాకర్ రావు, సెక్రటరీ జనరల్ గా  సదానందం ఎన్నికయ్యారు. శుక్రవారం పవర్​ ఇంజినీర్స్​ ఎన్నికల ఫలితాలను రిటర్నింగ్​అధికారి సమ్మయ్య ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,916 మంది ఇంజినీర్లు ఏఈ స్థాయి నుంచి ఎగ్జిక్యూటీవ్​ డైరెక్టర్​ స్థాయి వరకు మెంబర్లుగా ఉన్న స్టేట్​పవర్​ఇంజనీర్స్​అసోసియేషన్​కు సెంట్రల్​కమిటీ, ట్రాన్స్​కో, జెన్​కో, ఎన్​పీడీసీఎల్​కమిటీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. 

కాగా.. ఎస్​పీడీసీఎల్​లో ఈ నెల 13న  సీక్రెట్​ బ్యాలెట్​పద్ధతిలో ఎన్నికలు జరుగగా.. 80.70శాతం ఇంజినీర్లు ఓటింగ్​లో పాల్గొన్నారు. శుక్రవారం ఓట్ల లెక్కింపు ద్వారా విజేతలను ప్రకటించారు. అసోసియేట్ ప్రెసిడెంట్ గా  జేఎల్ జనప్రియ, అడిషనల్ సెక్రటరీగా ఎం.వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైనా స్టేట్​ ప్రెసిడెంట్​రత్నాకర్ రావు, సెక్రటరీ జనరల్ సదానందం మాట్లాడుతూ.. అవకాశం కల్పించిన విద్యుత్ ఇంజనీర్లందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం, విద్యుత్​ సంస్థలతో సమన్వయం చేసుకుని విద్యుత్ ఇంజినీర్ల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.