
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పవర్ లిఫ్టర్ తేజావత్ సుకన్య సౌతాఫ్రికాలో జరుగుతున్న ఆసియా పసిఫిక్, ఆఫ్రికన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. ఆదివారం జరిగిన విమెన్స్ 76 కేజీ వెయిట్ కేటగిరీ బెంచ్ ప్రెస్‌లో అందరికంటే ఎక్కువగా 135 కేజీల బరువెత్తి ఈ మెడల్ సొంతం చేసుకుంది.