పండుగ సాయన్న విగ్రహావిష్కరణ

పానుగల్, వెలుగు: మండలంలోని రాయినిపల్లి గ్రామంలో శుక్రవారం తెలంగాణ ప్రజా వీరుడు పండుగ సాయన్న విగ్రహాన్ని మక్తల్  ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, విగ్రహదాత  నీలం మధు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పండుగ సాయన్న ధనవంతులను దోచి పేదవాళ్లకు పెట్టే వాడని గుర్తు చేశారు. 

తెలంగాణ రాబిన్ హుడ్ గా సుపరిచితుడని చెప్పారు. ముదిరాజ్  కులస్తులు కలిసిమెలిసి ఉండాలని పిలుపునిచ్చారు. పగిడాల శ్రీనివాస్ రెడ్డి, బెక్కం జనార్ధన్, శ్రీనివాసులు, మాజీ జడ్పీటీసీ రవి, మాజీ ఎంపీపీ వెంకటేశ్​ నాయుడు, మధుసూదన్ రెడ్డి,తిరుపతయ్య, సాగర్  పాల్గొన్నారు.