
- తెలంగాణ రాష్ట్ర వైశాల్యం 1,21,770 చ.కి.మీ.
- ఉనికి రీత్యా తెలంగాణ రాష్ట్రం 15 డిగ్రీల50 నుంచి 19 డిగ్రీల 15 ఉత్తర అక్షాంశాల మధ్య ఉంది.
- ఉనికి రీత్యా తెలంగాణ రాష్ట్రం ఉత్తరార్ధగోళంలో విస్తరించి ఉంది.
- తెలంగాణ రాష్ట్రం వైశాల్యపరంగా కొత్తగూడెం అతిపెద్ద జిల్లా.
- ఉనికిరీత్యా తెలంగాణ రాష్ట్రం 77 డిగ్రీల 15 నుంచి 84 డిగ్రీల 19 తూర్పు రేఖాంశాల మధ్య ఉంది.
- దేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ విస్తీర్ణం 3.41శాతం ఉంది.
- తెలంగాణ రాష్ట్రంలో విస్తీర్ణ దృష్ట్యా అతి చిన్న జిల్లా హైదరాబాద్.
- తెలంగాణ రాష్ట్ర జనాభా కెనడా దేశ జనాభాకు సమానంగా ఉంటుంది.
- తెలంగాణలో జనాభాపరంగా అతిపెద్ద జిల్లా హైదరాబాద్.
- దేశ జనాభాలో తెలంగాణ జనాభా శాతం 2.89శాతం.
- వైశాల్యపరంగా దేశంలో తెలంగాణ 11వ స్థానంలో ఉంది.
- వైశాల్యపరంగా దేశంలో తెలంగాణ తర్వాతి స్థానంలో బిహార్ రాష్ట్రం ఉంది.
- జనాభాపరంగా దేశంలో తెలంగాణ 12వ స్థానంలో ఉంది.
- జనాభాపరంగా దేశంలో తెలంగాణ తర్వాతి స్థానంలో కేరళ రాష్ట్రం ఉంది.
- పురాణాలలో తెలంగాణ ప్రాంతాన్ని దక్షిణాపథం అని పిలిచేవారు.
- కరీంనగర్ ను పూర్వం ఎల్గందుల పేరుతో పిలిచేవారు.
- ఆదిలాబాద్‌ను పూర్వం ఎదులాపురంతో పిలిచేవారు.
- రంగారెడ్డి జిల్లా 1978, ఆగస్టు 15న ఏర్పడింది.
- హైదరాబాద్ రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 8.
- తెలంగాణ అధికారిక వార్తా ఛానల్ దూరదర్శన్ యాదగిరి.
- నిజాం రాజ్యంపై భారత ప్రభుత్వం చేపట్టిన విలీన ఆపరేషన్.. ఆపరేషన్ పోలీ.
- మహబూబ్‌నగర్ ను పూర్వం పాలమూరు జిల్లాగా పిలిచేవారు.
- పూర్వం ప్రాదన్యపురంగా బోధన్ ప్రాంతాన్ని పిలిచేవారు.
- ఖమ్మం జిల్లా ఏర్పడిన సంవత్సరం 1953.
- 2016, అక్టోబర్ 11న తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాల సంఖ్య 21.
- తెలంగాణ ముసాయిదా బిల్లును లోక్‌సభలో 2014, ఫిబ్రవరి 13న ప్రవేశపెట్టారు.
- తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం జూన్ 2.
- తెలంగాణ రాష్ట్ర కాలప్రామాణిక రేఖాంశం 82 డిగ్రీల 30 డిగ్రీల తూర్పు రేఖాంశం.
- మెతుకు దుర్గం అనే పేరుతో పూర్వం పిలువబడిన ప్రస్తుత నగరం మెదక్.
- పూర్వం నీలగిరిగా పిలువబడిన ప్రాంతం నల్లగొండ.
- నిజామాబాద్ పూర్వ నామం ఇందూరు.
- హైదరాబాద్ రాష్ట్రంలోని మరఠ్వాడా ప్రాంతంలోని జిల్లాల సంఖ్య 6.
- తెలంగాణ రాష్ట్ర జనసాంద్రత 312.
- అధిక జనసాంద్రత కలిగిన జిల్లా హైదరాబాద్.
- అత్యల్ప జనసాంద్ర కలిగిని జిల్లా ములుగు.
- అత్యల్ప జనాభా కలిగిన జిల్లా ములుగు.
- తెలంగాణ రాష్ట్ర స్త్రీ పురుష లింగ నిష్పత్తి 988.
- తెలంగాణ రాష్ట్ర అధికారిక జంతువు మచ్చలజింక.
- తెలంగాణ రాష్ట్ర అధికార పక్షి పాలపిట్ట.
- తెలంగాణ రాష్ట్ర అధికార వృక్షం జమ్మిచెట్టు.
- తెలంగాణ రాష్ట్ర అధికార పుష్పం తంగేడు.
- తెలంగాణ రాష్ట్ర అధికార భాషలు 2.
- తెలంగాణ రాష్ట్ర భాషా దినోత్సవం సెప్టెంబర్ 9.
- తెలంగాణ రాష్ట్ర చిహ్నం కాకతీయ శిలాతోరణంతో కూడిన చార్మినార్.
- రాష్ట్ర అధికారిక క్రీడ కబడ్డీ.
- రాష్ట్ర అధికారిక చేప కొరమీను.
- రాష్ట్ర అధికారిక పండు సీతాఫలం.
- తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని రూపొందించిన చిత్రకారుడు ఏలే లక్ష్మణ్.
- తెలంగాణ ఇంజినీర్స్ డే జులై 11.
- తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్త బైరోజు వెంకటరమణాచారి.
- తెలంగాణ అధికారిక గీతం జయ జయహే తెలంగాణ.
- తెలంగాణ రాష్ట్ర తొలి హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి.
- తెలంగాణలో హైదరాబాద్ జిల్లాకు జిల్లా పరిషత్ లేదు.
- తెలంగాణలో మొత్తం రెవెన్యూ డివిజన్లు 74.
- రాష్ట్రంలోని మొత్తం రెవెన్యూ మండలాలు 594.
- రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు లేని జిల్లా హైదరాబాద్.
- రాష్ట్రంలో అత్యధిక గ్రామ పంచాయతీలు కలిగిన జిల్లా నల్లగొండ.
- జిల్లాల పునర్విభజనలో విభజించబడని ఏకైక జిల్లా హైదరాబాద్.
- తెలంగాణలో అధిక శాసనసభ స్థానాలు గల జిల్లా హైదరాబాద్.
- తెలంగాణ బయోడైవర్సిటీ పార్కు గచ్చిబౌలిలో ఉంది.
- తెలంగాణ జిల్లాలో పునర్విభజనలో అత్యధిక జిల్లాలుగా విభజించబడిన పూర్వ జిల్లా వరంగల్.