హైదరాబాద్, వెలుగు: ఆదిలాబాద్– నిజామాబాద్ – కరీంనగర్ – మెదక్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్యకు తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ యూనియన్ (టీపీటీయూ) మద్దతు ప్రకటించింది. ఆయన గెలుపునకు కృషి చేస్తామని వెల్లడించింది.
ఈ మేరకు మంగళవారం అభ్యర్థి మల్క కొమురయ్యను టీపీటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మట్టపల్లి రాధాకృష్ణారావు, పట్లోళ్ల చంద్రశేఖర్, అడిషనల్ జనరల్ సెక్రటరీ సారయ్య తదితరులు కలిసి మద్దతు లేఖను అందించారు.