పకడ్బందీగా గ్రూప్ 1 ప్రిలీమ్స్.. అభ్యర్థులు ఇవి తెలుసుకునే ఎగ్జామ్ కు వెళ్లండి

పకడ్బందీగా గ్రూప్ 1 ప్రిలీమ్స్.. అభ్యర్థులు ఇవి తెలుసుకునే ఎగ్జామ్ కు వెళ్లండి

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జూన్ 9న జరగనుంది. గతంలో ఈ పరీక్ష రెండు సార్లు నిర్వహించగా.. పేపర్ లీక్, తప్పు ప్రశ్నల కారణంగా రద్దు చేయబడింది. ప్రభుత్వం మారిన తర్వాత  టీఎస్పీఎస్ ఛైర్మన్, సభ్యులు తొలిగించి ప్రక్షాళణ చేసి పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈమేరకు గ్రూప్ -1 పరీక్షకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సర్వం సిద్ధం చేసింది. 

ఎల్లుండి ఉదయం 10గంటల 30 నిమిషాలకు గ్రూప్-1 ప్రిలిమ్స్ జరగనుంది. రాష్ట్రంలో 4లక్షల 3వేల మందిఅభ్యర్థులుపరీక్షలు రాయనున్నారు. గతంతో జరిగిన తప్పులను పునరావృతం కాకుండా టీజీపీఎస్సీ పకడ్బంధీ ఏర్పాట్లు చేసింది. హాల్ టికెట్ పై రీసెంట్ ఫోటో అతికించుకొని ఎగ్జామ్ సెంటర్ కు రావాలని బోర్డ్ సూచిస్తుంది. ఉదయం 9.30  గంటలకే ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవాలని, బయోమెట్రిక్ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తిఅయ్యాకే అభ్యర్థులకు లోపలికి పంపనున్నారు.
 

ఫిబ్రవరి 19న 563పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసింది.  పోస్టులు: డిప్యూటీ కలెక్టర్లు- 45, డీఎస్పీ- 115, సీటీవో- 48, ప్రాంతీయ రవాణా అధికారి- 4, జిల్లా పంచాయతీ అధికారి- 7, జిల్లా రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌- 6, జైళ్లశాఖలో డీఎస్పీ- 5, అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ లేబర్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌- 8, అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌- 30, గ్రేడ్‌‌‌‌‌‌‌‌-2 మున్సిపల్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌లు- 41, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి- 3, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి- 5, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి-2, జిల్లా ఉపాధి అధికారి- 5, పరిపాలనాధికారి (వైద్యారోగ్యశాఖ)- 20, అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ ట్రెజరీ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌- 38, అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ ఆడిట్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌- 41,  మండల పరిషత్‌‌‌‌‌‌‌‌ అభివృద్ధి అధికారి- 140.