టీజీపీఎస్సీ కొత్త చైర్మన్​ నియామకానికి నోటిఫికేషన్

  • 20 వరకూ అప్లికేషన్ల స్వీకరణ 

హైదరాబాద్,వెలుగు: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కొత్త చైర్మన్ కోసం సర్కారు కసరత్తు మొదలుపెట్టింది. వచ్చేనెల 2వ తేదీతో ప్రస్తుతమున్న చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం ముగియనున్నది. దీంతో కొత్త వ్యక్తిని నియమించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నెల 20 సాయంత్రం 5 లోగా ఆసక్తి ఉన్న వాళ్లు నిర్ణీత ఫార్మాట్ లో అప్లై చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. 

పూర్తిచేసిన అప్లికేషన్​ను prisecy-ser-gpm-gad@telangana.gov.in మెయిల్​కు పంపించాలని కోరింది. అప్లికేషన్ ఫార్మాట్ www.telangana.gov.in వెబ్ సైట్లో ఉంటుందని వెల్లడించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసే సెర్చ్ కమ్ స్ర్కీనింగ్ కమిటీ ద్వారా అప్లికేషన్లలో నుంచి లేదా నేరుగా ఎంపిక చేయనున్నట్టు తెలిపింది.