సిలబస్​ పరిధి తెలిస్తే.. గ్రూప్​-4 జాబ్​ ఈజీ

సిలబస్​ పరిధి తెలిస్తే.. గ్రూప్​-4 జాబ్​ ఈజీ

భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ: భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలు మాత్రమే సిలబస్​లో ఉంది. రాజ్యాంగం ముఖ్య లక్షణాలు ఈ మధ్యకాలంలో వివాదాస్పదమైతే వాటి మీద బాగా ఫోకస్​ చేయాలి. సిలబస్​లో ప్రభుత్వం అంటే కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వం అని అర్థం. కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి, మంత్రి మండలి, లోక్​సభ, రాజ్యసభ అంశాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం అంటే గవర్నర్​, ముఖ్యమంత్రి, మంత్రి మండలి, రాష్ట్ర శాసనసభ, శాసనమండలి వంటి అంశాలు ఉంటాయి. స్థానిక ప్రభుత్వం అంటే పంచాయతీరాజ్​ వ్యవస్థ, మున్సిపాలిటీ గురించి ఉంటాయి. 1992 వరకు స్థానిక ప్రభుత్వం గురించి ఎక్కడా చట్టాలు లేవు. 1992 తర్వాత స్థానిక ప్రభుత్వాల మీద చట్టం తెచ్చారు. కాబట్టి గ్రూప్​–4 స్థాయిలో స్థానిక ప్రభుత్వాల అంశంపై ఫోకస్​ చేయాలి. 


అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు: అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు అనేవి వేర్వేరు అంశాలు. అంతర్జాతీయ సంబంధాలు అంశం కిందకి భారతదేశానికి, ఇరుగుపొరుగు దేశాలతో సంబంధాలు. ఉదాహరణకు చైనా, అఫ్ఘనిస్తాన్​, పాకిస్తాన్, నేపాల్​, భూటాన్​, మయన్మార్, బంగ్లాదేశ్​, శ్రీలంక, మాల్దీవులు వస్తాయి. అంతర్జాతీయ సంఘటనల కిందికి ఇంటర్నేషనల్​ సమ్మిట్స్​ అయిన జీ20, ఐ2యూ2, జీ8, సార్క్​, ఆసియాన్​ మొదలైనవి, ఒప్పందాలు, ఉల్లంఘనలు చదువుకోవాలి. అంతర్జాతీయ ఒప్పందాలలో ముఖ్యమైనవి సౌరశక్తి, పర్యావరణం, క్లైమేట్​ ఛేంజ్, అణు, శాంతి ఒప్పందాలపై ఎక్కువ ఫోకస్​ చేయాలి.


తెలంగాణ ప్రభుత్వం  9,168 గ్రూప్‌‌‌‌‌‌‌‌-4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ విడుదల చేసింది. డిసెంబర్​ 23 నుంచి జనవరి 12 వరకు అప్లికేషన్లు తీసుకోనున్నట్లు తెలిపింది. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ లేదా మే నెలలో పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పేపర్​1 లోని జనరల్​ నాలెడ్జ్​  విభాగంలో సిలబస్​లో ఇచ్చిన అంశాలను ఎలా ప్రిపేర్​ అవ్వాలో తెలుసుకుందాం.. 


పేపర్​‌‌–1లో ఉన్న జనరల్​ నాలెడ్జ్​ను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా సిలబస్​పై పూర్తి అవగాహన ఉండాలి. సాధారణంగా అన్ని పోటీ పరీక్షల్లో జనరల్​ స్టడీస్​ సిలబస్​ ఒకటే అని భావిస్తారు. కాని సబ్జెక్ట్​ ఒకటే అయినా సబ్జెక్టులో ఉన్న అంశాలు ఒకటి కావు. కాబట్టి ప్రతి అంశాన్ని జాగ్రత్తగా గమనించాలి. జనరల్​ నాలెడ్జ్​​ పేపర్​1లో మొత్తం 11 అంశాలు ఉంటాయి. ఈ అంశాలు విస్తృతంగా లేకపోవడం, లిమిటెడ్​గా ఉండడాన్ని అభ్యర్థులు గమనించి ప్రిపేర్​ అవ్వాలి. 


కరెంట్​ అఫైర్స్​: సిలబస్​లో కరెంట్​ అఫైర్స్​ అని మాత్రమే ఇచ్చారు. మిగతా జనరల్​ స్టడీస్​లో అయితే ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ కరెంట్​ అఫైర్స్​ అని ఉంటుంది. అయితే గ్రూప్​4లో కరెంట్​ అఫైర్స్​ మీద ఫోకస్​ ఉంటుంది. కాని ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ కరెంట్​ అఫైర్స్​లో దేనికి ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పలేము. ఈ పరీక్ష జూనియర్​ అసిస్టెంట్​, లోయర్​ లెవెల్​ స్థాయి పరీక్ష కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఉంటే ప్రాంతీయ అంశాల మీద ఎక్కువ ఫోకస్​ చేయాలి. ప్రైవేట్ మ్యాగజైన్స్​ కంటే న్యూస్​ పేపర్స్​ చదివి సొంతంగా నోట్స్​ తయారు చేసుకోవాలి. ఒక సంవత్సరంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలను చదువుకొని వెళ్లాలి. 


నిత్య జీవితంలో జనరల్​ సైన్స్​:  జనరల్​​ సైన్స్​ విషయానికి వస్తే ఇతర పోటీ పరీక్షల సిలబస్​తో పోల్చితే ఇది లిమిటెడ్​గా ఉంది. సైన్స్​ అండ్​ టెక్నాలజీ అని సిలబస్​లో ఇచ్చి ఉంటే అంశం విస్తృతంగా ఉండేది. ఇక్కడ నిజ జీవితంలో జనరల్​ సైన్స్​ అని సిలబస్​లో ఉండడంతో బయాలజీ, ఫిజిక్స్​, కెమిస్ట్రీ సబ్జెక్టులను ఆరో తరగతి నుంచి ఇంటర్​ పుస్తకాలు చదవాలి. 


పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ: తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విపత్తు నిర్వహణ అంశానికి ప్రాధాన్యత తగ్గిపోయింది. పర్యావరణ సమస్యలు అనే టాపిక్​​ ఇండియన్​ జాగ్రఫీతో అనుసంధానం అయి ఉంటుంది. కాబట్టి దీనిపై ఫోకస్​ చేయాలి. ఇందులో భౌగోళికమైన అంశాలతో పర్యావరణానికి అనుసంధానం అయ్యే అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. 


ఇండియన్​ జాగ్రఫీ: ఇండియన్​ జాగ్రఫీని డైనమిక్, స్టాటిక్ చాప్టర్లుగా విభజించుకోవాలి. స్టాటిక్​గా ఉండే చాప్టర్లకు ఉదాహరణలు నైసర్గిక స్వరూపం, నదులు, శీతోష్ణస్థితి, నేలలు మొదలైనవి. డైనమిక్​గా ఉండే  పట్టణీకరణ, రవాణా మొదలైనవి. అట్లాస్​ దగ్గర పెట్టుకొని మ్యాప్​ పాయింటింగ్​ మెథడ్​లో జాగ్రఫీని ప్రిపేర్​ అయితే గుర్తుంచుకోవడం సులువు.


తెలంగాణ జాగ్రఫీ అండ్​ ఎకానమీ: తెలంగాణ కొత్త రాష్ట్రం కాబట్టి జాగ్రఫీపై ఫోకస్​ పెట్టాలి. కొత్తగా వస్తున్న మార్పులను జాగ్రత్తగా గమనించాలి. తెలంగాణ జాగ్రఫీలో ఎక్కడైతే భౌగోళికమైన మార్పులు జరిగాయో అక్కడ దృష్టి సారించాలి. తెలంగాణ ఎకానమీకి సంబంధించి తెలంగాణ అవుట్​లుక్​, తెలంగాణ ఆర్థిక సర్వే, తెలంగాణకు సంబంధించిన సమకాలిన అంశాలను చదువుకోవాలి. తెలంగాణ ఎకానమీకి పోటీ పరీక్షల్లో ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా వ్యవసాయం, భూ సంస్కరణలు, పరిశ్రమలు, సేవా రంగాలు చూసుకోవాలి .


ఇండియన్​ ఎకానమీ:  ఇండియన్​ ఎకానమీకి సంబంధించి ఒక ప్రామాణికమైన పుస్తకంతోపాటు భారతదేశ ఆర్థిక సర్వే, బడ్జెట్​లను చదవాలి. ప్రామాణికమైన పుస్తకం అంటే బీఏ స్థాయిలో డిగ్రీల్లో ఉండే సెమిస్టర్​ వైజ్​ పుస్తకాలను చదవడం మంచిది. కనీసం రెండు సంవత్సరాల భారతదేశ ఆర్థిక సర్వేలను, ఒక సంవత్సరం బడ్జెట్​ను క్షుణ్ణంగా చదవాల్సి ఉంటుంది. ఈ మధ్యకాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా భారతదేశం ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా మార్పు చెందుతున్నది గమనించాలి.


తెలంగాణ అంశాలకు ప్రాధాన్యం: తెలంగాణ చరిత్ర అంటే శాతవాహనుల నుంచి అసఫ్​జాహీల వరకు సాంఘిక, సాంస్కృతిక, వారసత్వ అంశాలు, కళలు, సాహిత్యం గురించి ఎక్కువ ప్రాక్టీస్​ చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమాన్ని మూడు దశలుగా విభజించుకొని చదువుకోవాలి. ముఖ్యంగా రాష్ట్ర సాధనలో పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, వివిధ వర్గాల పాత్ర, జేఏసీ కార్యక్రమాల నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, వికలాంగులకు సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చదువుకోవాలి. ఇండియన్​ హిస్టరీకి సంబంధించి సిలబస్​లో కేవలం జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో ఆధునిక భారతదేశ చరిత్ర మాత్రమే ప్రిపేర్​ కావాలి.

 

పేపర్ 1: ఇందులో మొత్తం 150 మార్కులకు 150 ప్రశ్నలు ఇస్తారు. సిలబస్​లో కరెంట్​ అఫైర్స్​, అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు, నిత్య జీవితంలో జనరల్ సైన్స్​, పర్యావరణ సమస్యలు, విపత్తుల నిర్వహణ, భారతదేశ, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, భౌగోళిక అంశాలు, భారత రాజ్యాంగం, ప్రధాన లక్షణాలు,  భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం,  జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో ఆధునిక భారతదేశ చరిత్ర, తెలంగాణ చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం,  తెలంగాణ సాంఘిక, సాంస్కృతిక, వారసత్వ అంశాలు, కళలు, సాహిత్యం, తెలంగాణ రాష్ట్ర విధానాలు ఉన్నాయి. సిలబస్​ మనం పూర్తిగా పరిశీలిస్తే సైన్స్​ అండ్ టెక్నాలజీ, వరల్డ్​ జాగ్రఫీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు లాంటి అంశాలు​ లేవు. ఇలా సబ్జెక్టుకు సంబంధించిన అన్ని అంశాలు కాకుండా సిలబస్​లో ఉన్న టాపిక్స్​ ప్రిపేర్​ అయితే జాబ్​ కొట్టడం సులువే

.  
నోటిఫికేషన్​:  9,168 పోస్టులతో గ్రూప్‌‌‌‌‌‌‌‌- 4 ఉద్యోగ ప్రకటనను  టీఎస్‌‌‌‌‌‌‌‌పీఎస్సీ జారీ చేసింది. డిసెంబర్​ 23 నుంచి జనవరి 12 వరకు అప్లికేషన్లు తీసుకోనున్నారు. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ లేదా మే నెలలో పరీక్ష నిర్వహించనున్నారు. పూర్తి నోటిఫికేషన్​ను టీఎస్​పీఎస్సీ డిసెంబర్​ 23న విడుదల చేయనుంది. ఖాళీగా ఉన్న పోస్టుల్లో జూనియర్‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌(6,859), జూనియర్‌‌‌‌‌‌‌‌ అకౌంటెంట్‌‌‌‌‌‌‌‌(429), జూనియర్‌‌‌‌‌‌‌‌ ఆడిటర్‌‌‌‌‌‌‌‌(18), వార్డు అధికారుల(1,862) ఉద్యోగాలు ఉన్నాయి.  గ్రూప్‌‌‌‌‌‌‌‌-4 ఉద్యోగాల్లో అత్యధికంగా పురపాలకశాఖ పరిధిలో 2,701 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 1,862 వార్డు అధికారుల పోస్టులున్నాయి. రెవెన్యూశాఖ పరిధిలో 2,077 పోస్టులు ఉండగా.. ఇందులో సీసీఎల్‌‌‌‌‌‌‌‌ఏ పరిధిలో 1,294 ఉన్నాయి. సాధారణ, సంక్షేమ గురుకులాల్లో 991 పోస్టులు భర్తీ కానున్నాయి.

పృథ్వీ కుమార్​ చౌహాన్​
పృథ్వీస్​ IAS స్టడీ సర్కిల్​