తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో మోస్తరు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు 7 జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. నల్గొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. మిగతా జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆవర్తనం ఒకటి గ్యాంగ్టక్, పశ్చిమ బెంగాల్ మరియు పరిసర బంగ్లాదేశ్ ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 1.5 నుంచి 7..6 కి. మీ. ఎత్తు మధ్యలో విస్తరించి ఉంది. రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ పేర్కొంది.
భారత వాతావరణ శాఖ ఇంకా ఏం చెప్పిందంటే..
* తెలంగాణలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడా బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే అవకాశం అవకాశం వుంది.
* ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండటం తో మరో 2 రోజుల పాటు ఎల్లో అలర్ట్స్ జారీ
* తెలంగాణలో ఆదిలాబాద్, కొమరంభీం- ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
* ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో కూడిన వర్షాలకు ఛాన్స్ ఉంది
* రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు వెల్లడించారు.