తెలంగాణలో రెండు రోజులు వర్షాలు..పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

 తెలంగాణలో రెండు రోజులు వర్షాలు..పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

హైదరాబాద్/ శంషాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఫెయింజల్​ తుఫాను మామూలుగానే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. దాని ప్రభావంతో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. డిసెంబర్ 1న భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల్ జిల్లాలకు, సోమవారం.. మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది. 

Also Read : ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతుల్లో బోనస్ సంబురం

హైదరాబాద్​లోనూ రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని ఐఎండీ పేర్కొంది. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం ఉదయం నుంచి మబ్బు పట్టి ఉంది. కాగా, శుక్రవారం రాత్రి టెంపరేచర్లు సాధారణ స్థితిలోనే నమోదయ్యాయి. తుఫాను ప్రభావంతోనే రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గినట్టు ఐఎండీ పేర్కొంది. ఒక్క ఆదిలాబాద్​ జిల్లా తప్ప మిగతా అన్ని జిల్లాల్లోనూ 15 డిగ్రీలకుపైగానే రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్​ జిల్లా తలమడుగులో 14.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మరో రెండు రోజుల పాటు ఇవే పరిస్థితులు ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.