బీజేపీకి రమాకాంత్​రావు రాజీనామా

రాజన్నసిరిసిల్ల, వెలుగు : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు  రమాకాంత్ రావు, పార్టీ పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేశారు. మంగళవారం హైదరాబాద్​లో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. 

రమాకాంత్​రావు మాట్లాడుతూ బీజేపీ నమ్మకద్రోహం చేసిందని, అందుకే బీఆర్ఎస్​లో చేరినట్టు చెప్పారు. సిరిసిల్లలో రాణి రుద్రమకు టికెట్ కేటాయించేటప్పుడు కనీసం తమను సంప్రదించలేదన్నారు. బీజేపీలో దాసోజు శ్రవణ్​ఉన్నప్పుడు కూడా సుముచిత స్థానం 
కల్పించలేదన్నారు.