
భద్రాచలం, వెలుగు: భద్రాచలంలో ఈ నెల 6న శ్రీరామనవమి సందర్భంగా జరిగిన సీతారాముల కల్యాణం తలంబ్రాలకు డిమాండ్ పెరిగింది. ఆర్టీసీ కార్గో ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని భక్తులకు ముత్యాల తలంబ్రాలను చేరవేస్తోంది.
కార్గోకు ఇప్పటికే 80 వేల ప్యాకెట్లను దేవస్థానం అందజేయగా, 1,24,850 అవసరమంటూ ఆర్టీసీ దేవస్థానానికి ఇండెంట్ ఇచ్చింది. మొత్తంగా 2,04,850 ప్యాకెట్లను కార్గో భక్తులకు చేరవేస్తోంది.
పోస్టల్ ద్వారా మొదటి విడత 16 వేలు, రెండో విడతలో 10,598 చొప్పున26,598 ప్యాకెట్లను భక్తుల ఇండ్లకు పంపుతోంది. నిరుడు ఆర్టీసీ కార్గో ద్వారా 46, 400, పోస్టల్ డిపార్ట్మెంట్ 2,809 ప్యాకెట్లను భక్తులకు పంపించాయి. దీంతో దేవస్థానానికి రూ.57,86,200 ఆదాయం సమకూరింది.