నెల రోజుల్లో 4.4 కోట్ల మందికి టెస్టులు..2.65 లక్షల ఫీవర్ కేసులను గుర్తించినం : డీహెచ్​

నెల రోజుల్లో 4.4 కోట్ల మందికి టెస్టులు..2.65 లక్షల ఫీవర్  కేసులను గుర్తించినం : డీహెచ్​

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఫీవర్  సర్వే నిర్వహిస్తున్నామని, గత నెల 23 నుంచి ఈ నెల 25 వరకు 4,40,06,799 మందిని పరీక్షించామని పబ్లిక్  హెల్త్  డైరెక్టర్  రవీందర్  నాయక్  సోమవారం ప్రకటించారు. 4.4 కోట్ల మందిలో 2.65 లక్షల మంది జ్వరం బారినపడినట్లు గుర్తించామన్నారు.  ఈ ఏడాది 5,372 డెంగీ,  152 చికున్  గున్యా, 191 మలేరియా కేసులు నమోదయ్యాయన్నారు.

 డెంగీ అత్యధికంగా హైదరాబాద్‌‌లో 1,852, సూర్యాపేటలో 471, మేడ్చల్‌‌లో 426, ఖమ్మంలో 375, నల్గొండలో 315, నిజామాబాద్‌‌లో 286, రంగారెడ్డిలో 232 కేసులు నమోదయ్యాయని తెలిపారు.రాష్ట్రంలో ఫీవర్  సర్వే నిర్వహిస్తున్నామని, నెల రోజుల్లో 4 కోట్ల 40 లక్షల మందిని పరీక్షించామని పబ్లిక్  హెల్త్  డైరెక్టర్ రవీందర్ తెలిపారు. ఇందులో 2.65 లక్షల మంది జ్వరం బారినపడినట్లు చెప్పారు.