హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 81,486 శాంపిల్స్ పరీక్షించగా.. 2,861 మందికి పాజిటివ్గా నిర్థారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 746 మంది కరోనా బారినపడ్డారు. మేడ్చల్ మల్కాజ్గిరిలో 234, రంగారెడ్డిలో 165, ఖమ్మంలో 130, నల్గొండలో 104 చొప్పున కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 4,413 మంది వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకోగా.. 3 మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 94.60శాతంగా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 37,168 యాక్టివ్ కేసులున్నాయి.