రాష్ట్రంలో భారీగా పెరిగిన కరోనా కేసులు

రాష్ట్రంలో భారీగా పెరిగిన కరోనా కేసులు

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 1,07,904 టెస్టులు నిర్వహించగా... 2983 మందికి కరోనా నిర్థారణ అయింది. ఈ రోజు 2,706 మంది వైరస్ నుంచి కోలుకోగా.. ఇద్దరు చనిపోయారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1206 కేసులు నమోదుకాగా.. మేడ్చల్ మల్కాజ్ గిరిలో 259, రంగారెడ్డిలో 227, హనుమకొండలో 118, సంగారెడ్డి జిల్లాలో 96 మంది కొవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 0.57శాతంగా ఉండగా.. రికవరీ రేటు 96.29శాతంగా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 22,472 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఈ రోజు 2,93,843మందికి టీకా వేశారు. వారిలో 66,335 మంది ఫస్ట్ డోస్ వ్యాక్సిన్, 2,11,425 మంది సెకండ్ డోస్, 16,083 మంది ప్రికాషనరీ డోస్ టీకా తీసుకున్నారు.

For more news..

ఆన్లైన్లో పెళ్లి.. అతిధుల ఇంటికే భోజనం..

టెస్టు కెప్టెన్సీపై మనసులోమాట బయట పెట్టిన రాహుల్