రాష్ట్రంలో భారీగా పెరిగిన కరోనా  కేసులు

రాష్ట్రంలో భారీగా పెరిగిన కరోనా  కేసులు

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. కొవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో 1,20,215 టెస్టులు నిర్వహించగా.. 4,027 మందికి కరోనా సోకినట్లు తేలింది. జీహెచ్ఎంసీ పరిధిలో 1,645 మంది కొవిడ్ బారినపడగా.. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 380, రంగారెడ్డిలో 336, హనుమకొండలో 154, సంగారెడ్డిలో 107 కేసులు నమోదయ్యాయి. గురువారం 1,825 మంది వైరస్ నుంచి కోలుకోగా.. ఇద్దరు చనిపోయారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 0.56శాతం కాగా.. రికవరీ రేటు 95.75 శాతంగా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో 26,633 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

For more news..

వీగన్స్ ​కోసం స్పెషల్​ చికెన్ 65, సలాడ్స్​

కరోనా టెస్టు రేట్లను తగ్గించిన మరో రాష్ట్రం