గుడ్ న్యూస్: లక్షన్నర రుణమాఫీ..రైతుల ఖాతాల్లోకి 6 వేల190 కోట్లు

గుడ్ న్యూస్: లక్షన్నర రుణమాఫీ..రైతుల ఖాతాల్లోకి 6 వేల190 కోట్లు

లక్షన్నర  లోపు పంట రుణాలను మాఫీ చేసింది రాష్ట్ర సర్కార్. రెండో విడతగా రైతుల క్రాప్ లోన్ అకౌంట్లలో నిధులు జమ చేసింది. అసెంబ్లీ ఆవరణలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు రుణమాఫీ నిధులను విడుదల చేశారు. ఇందుకోసం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు అధికారులు.  రాష్ట్ర వ్యాప్తంగా లక్షన్నర లోపు రుణం ఉన్న 6 లక్షల 40 వేల  మంది రైతులకు సంబంధించిన 6 వేల 190 కోట్ల రూపాయలను జమ చేశారు. 

మొదటి విడతలో 11లక్షల 34 వేల 412 మంది రైతుల ఖతాల్లో 6 వేల కోట్లు రుణమాఫీ చేశారు. ఇవాళ రెండో విడతలో  6లక్షల40 వేల 823 మంది రైతుల ఖాతాల్లో 6 వేల 90 కోట్లు జమ అయ్యాయి. మొత్తం రెండు విడతల్లో కలిసి 17లక్షల 75 వేల235 మంది రైతులకు లబ్ధి చేకూరింది.  రెండు విడతల్లో  12 వేల 224 కోట్లు  జమ చేశారు. 

రుణమాఫీ మొదటి విడతగా లక్ష లోపు రుణాలకు సంబంధించి 11 లక్షల 32 వేల కుటుంబాలకు 6 వేల కోట్లకు పైగా నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. సాంకేతిక సమస్యలతో 17 వేల 877 ఖాతాల్లో 84 కోట్ల 94 లక్షలు జమ కాలేదు. వ్యవసాయశాఖకు మొదటి దశ రుణమాఫీపై  లక్షా 20 వేల వరకు ఫిర్యాదులు వచ్చాయి. ఆధార్, బ్యాంక్ ఖాతాలో ఒకే విధంగా పేరు లేకపోవడం వంటి కంప్లైంట్లు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు.

బ్యాంక్ అకౌంట్ 1 నుంచి 9 నంబర్ తో స్టార్ట్ అవుతుందనీ అయితే సున్నా నుంచి స్టార్ట్ అయ్యే అకౌంట్లకు రుణమాఫీ కాలేదన్న ఫిర్యాదులు వచ్చాయన్నారు వ్యవసాయ శాఖ అధికారులు. ఆర్బీఐ సూచించిన వివరాల ప్రకారం ఈ రైతుల అకౌంట్లలో ఉన్న టెక్నికల్ సమస్యలను పరిష్కరించడానికి కొంత టైమ్ పడుతుందని చెప్పారు. సమస్యలు పరిష్కారం అయ్యాక రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని తెలిపారు. .