రాష్ట్రంలో కొనసాగుతున్న కొవిడ్ ఉద్ధృతి

రాష్ట్రంలో కొనసాగుతున్న కొవిడ్ ఉద్ధృతి

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 94,020 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 2,850 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 859 కేసులు నమోదుకాగా.. మేడ్చల్ మల్కాజ్ గిరిలో 173, రంగారెడ్డిలో 157, సిద్దిపేటలో 101మంది చొప్పున వైరస్ బారిన పడ్డారు. గత 24 గంటల్లో 4,291 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25,625 యాక్టివ్ కేసులు ఉండగా.. 3,205 శాంపిల్స్ రిజల్ట్స్ రావాల్సి ఉంది. 


మరిన్ని వార్తల కోసం..

బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు ఇవే

ముందస్తు ఎన్నికలంటూ అసత్య ప్రచారాలు