హైదరాబాద్: కరోనా విజృంభన కొనసాగుతోంది. రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య మళ్లీ 4 వేలు దాటాయి. గత 24 గంటల్లో 1,13,670 మందికి టెస్టులు నిర్వహించగా.. 4,559 మందికి పాజిటివ్ నిర్థారణ అయింది. ఇవాళ 1961 మంది వైరస్ నుంచి కోలుకోగా.. ఇద్దరు చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులసంఖ్య 36,269 కాగా.. రికవరీ రేటు 94.57శాతంగా ఉంది.
జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. జీహెచ్ఎంసీలో ఈ రోజు 1,450 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 432, రంగారెడ్డిలో 322, హనుమకొండలో 201, ఖమ్మంలో 145 చొప్పున కొత్త కేసులు వచ్చాయి.