రాష్ట్రంలో కొనసాగుతున్న కొవిడ్ వ్యాప్తి

రాష్ట్రంలో కొనసాగుతున్న కొవిడ్ వ్యాప్తి

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇవాళ 65,263 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 2482 మందికి పాజిటివ్గా తేలింది. టెస్టుల సంఖ్య తగ్గడంతో కరోనా నిర్థారణ అయినవారి సంఖ్య తగ్గింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1045 మంది వైరస్ బారినపడ్డారు. గత 24గంటల్లో 4,207 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. ఒకరు మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 38,723 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో రికవరీ రేటు 94.38శాతంగా ఉంది. 

మరిన్ని వార్తల కోసం..

రెండు స్థానాల నుంచి సీఎం చన్నీ పోటీ

సీఎం ఓడిపోతాడని మేం ముందే చెప్పాం