హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత 24 గంట్లలో 88,867 టెస్టులు నిర్వహించగా.. 3,801 మందికి పాజిటివ్ గా తేలింది. జీహెచ్ఎంసీలో ఎక్కువ మంది కరోనా బారినపడుతున్నారు. ఈ రోజు జీహెచ్ఎంసీ పరిధిలో 1,570 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్థారణ అయింది. రంగారెడ్డి జిల్లాలో 284, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 254, హనుమకొండలో 147, ఖమ్మంలో 139, సిద్ధిపేటలో 96 మందికి వైరస్ సోకింది. ఈ రోజు 2,046 మంది వైరస్ నుంచి కోలుకోగా.. ఒకరు చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 38,023 యాక్టివ్ కేసులున్నాయి.
నిన్నటితో పోలిస్తే టెస్టులు తగ్గడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4వేల దిగువకు వచ్చింది. మంగళవారం 1.13లక్షల శాంపిల్స్ టెస్ట్ చేయగా.. ఇవాళ 988,867 మందికి పరీక్షలు నిర్వహించారు. నిన్న 4559 మందికి కరోనా సోకినట్లు తేలింది.