రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. నిన్న 3,603 కేసులు నమోదుకాగా.. ఇవాళ ఆ సంఖ్య మరింత పెరిగింది. గడిచిన 24 గంటల్లో 97,113మందికి పరీక్షలు నిర్వహించగా.. 3,980మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,439 మంది కొవిడ్ బారిన పడ్డారు. ఈ రోజు 2,398 మంది కరోనా వైరస్ నుంచి కోలుకోగా.. ముగ్గురు మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 0.55శాతంగా ఉండగా.. రికవరీ రేటు 94.89శాతంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 33,673 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Telangana reports 3980 new #COVID19 cases, 2398 recoveries and 3 deaths in the last 24 hours.
— ANI (@ANI) January 24, 2022
Active cases 33,673 pic.twitter.com/c92gteAAnc