గురుకుల అడ్మిషన్ల దరఖాస్తుల గడువు పెంపు

గురుకుల అడ్మిషన్ల దరఖాస్తుల గడువు పెంపు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌‌‌‌‌‌‌‌ గురుకులాల్లో 5వ తరగతిలో అడ్మిషన్ల కోసం దరఖాస్తులకు గడువు పొడిగించినట్లు గురుకులాల సెట్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌ కన్వీనర్‌‌‌‌‌‌‌‌ రోనాల్డ్‌‌‌‌‌‌‌‌ రాస్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. సోమవారంతో ముగుస్తున్న గడువును ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 7వ వరకు పెంచినట్లు పేర్కొన్నారు. మే 5న ఎంట్రెన్స్‌‌‌‌‌‌‌‌ ఎగ్జామ్ ఉంటుందన్నారు. www.tgcet.cgg.gov.in, www.tswreis.ac.in, www.tresidential.cgg.gov.in, www.tgtwgurukulam.telangana.gov.in, www.mjptbcwreis.telangana.gov.in వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లలో అప్లికేషన్‌‌‌‌‌‌‌‌ పెట్టుకోవాలని సూచించారు. వివరాలకు 1800 425 45678 నంబర్‌‌‌‌‌‌‌‌కు కాల్ చేయాలని సూచించారు.