కొచ్చి విమానాశ్రయంలా వరంగల్​ ఎయిర్​పోర్ట్

కొచ్చి విమానాశ్రయంలా వరంగల్​ ఎయిర్​పోర్ట్
  • నిత్యం యాక్టివిటీ ఉండేలా డిజైన్​ చేయాలి: సీఎం రేవంత్​
  • అసంపూర్తిగా ఉన్న భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలి
  • ప్రతి నెలా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు ఆదేశం
  • ఆర్​ అండ్​ బీ ఆఫీసర్లతో ఉన్నతస్థాయి సమీక్ష

హైదరాబాద్​, వెలుగు: కేరళ రాష్ట్రంలోని కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ ఎయిర్ పోర్టు ఉండాలని అధికారులకు సీఎం రేవంత్​రెడ్డి సూచించారు. మామునూరు  ఎయిర్​పోర్టుకు సంబంధించి అసంపూర్తిగా ఉన్న భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని  ఆదేశించారు.  శనివారం హైదరాబాద్  జూబ్లీహిల్స్​లోని తన నివాసంలో ఆర్​ అండ్​ బీ అధికారులతో  సీఎం రేవంత్​ రెడ్డి  ఉన్నతస్థాయి రివ్యూ చేశారు. ఈ సందర్భంగా మామునూరు ఎయిర్ పోర్టుకు సంబంధించి పూర్తి వివరాలను సీఎంకు అధికారులు వివరించారు.  ఎయిర్​పోర్టు భూసేకరణ, పెండింగ్ పనులకు సంబంధించిన వివరాలను అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఎయిర్​పోర్టు వద్ద నిత్యం యాక్టివిటీ ఉండేలా  డిజైన్ చేయాలని అధికారులకు రేవంత్​ సూచించారు.  విమాన రాకపోకలతోపాటు ఇతర యాక్టివిటీస్ ఉండేలా, వరంగల్ నగరానికి అస్సెట్ గా ఎయిర్​పోర్ట్​ నిర్మాణం ఉండేలా  చూడాలన్నారు.  ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ప్రతి నెలా తనకు ప్రోగ్రెస్ రిపోర్ట్ అందించాలని ఆదేశించారు.  ఈ సందర్భంగా మామునూరు విమానాశ్రయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ధన్యవాదాలు తెలిపారు.  

నాలుగైదు  నెలల్లో ప్రారంభించేలా ప్లాన్​

ఎయిర్​పోర్ట్​ కోసం దాదాపు వెయ్యి ఎకరాల భూమి అవసరమవుతుంది. ఇప్పటికే ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టు పరిధిలో 696 ఎకరాల స్థలం ఉన్నది. ఆ భూమికి అదనంగా మరో 253 ఎకరాల్లో కొంత రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వే విస్తరణ, టెర్మినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఏటీసీ), నావిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రుమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాలేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణాలు చేపట్టనున్నారు. భూసేకరణకు అవసరమైన నిధులను కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్​ చేసింది. ఈ నెలలోనే భూసేకరణను కంప్లీట్​ చేయనున్నారు. నాలుగైదు నెలల్లోనే విమానాల రాకపోకలు సాగించేలా ప్లాన్​ చేస్తున్నారు.