
- సీసీఎల్ఏ నవీన్ మిట్టల్, జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డికి సన్మానం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యోగుల జేఏసీతోనే రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్థల బలోపేతం సాధ్యమని తెలంగాణ రెవెన్యూ సంఘాల నేతలు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం కొత్త పోస్టుల మం జూరు చేసిందన్నారు. గ్రామ స్థాయిలో 10,954 గ్రామ స్థాయి పరిపాలన అధికారులు (జీపీఓ), కొత్త డివిజన్లకు, మండలాలకు 361 పోస్టుల మంజూరు, 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు కేబినెట్ముద్ర వేయడానికి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఫలితమేనని టైర్మన్ వి.లచ్చిరెడ్డి అన్నారు.
రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి విశేషంగా కృషి చేస్తున్న సీఎం
రేవంత్‌రెడ్డికి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఇతర మంత్రులకు, సీసీఎల్ఏ నవీన్‌మిట్టల్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజా ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరిస్తాన్నారు. హైదరాబాద్‌లోని సీసీఎల్ఏ కార్యాలయంలో ఉదోగ్యుల జేఏసీ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా నవీన్ మిట్టల్, వి.లచ్చిరెడ్డికి సన్మాన కార్యక్రమం జరిగింది.
ఉద్యోగుల జేఏసీ వైస్ చైర్మన్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ అధ్యక్షతన జరిగి న కార్యక్రమంలో టీజీటీఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.రాములు, రమేశ్ పాక, సెక్రటరీ జనరల్ ఫూల్ సింగ్ చౌహాన్, మహిళా అధ్యక్షురాలు రాధ, టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బాణాల రాంరెడ్డి, వి.భిక్షం, మహిళా విభాగం అధ్యక్షురాలు సుజాతచౌహాన్, కోశాధికారి మల్లేశం, సీసీఎల్ఏ అధ్యక్షులు రాంబాబు, సీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ధర్శన్‌గౌడ్ ఉన్నారు.