రాష్ట్ర స్థాయి రెవెన్యూ ఉద్యోగులు మంగళవారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్ మెంట్ ను ప్రక్షాలన చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పలు నిర్ణయాలను తీసుకోనున్నట్లు వస్తున్న వార్తలపై ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభత్వం ప్రవేశపెట్టబోయే కొత్త చట్టం పై చర్చించేందుకు, తదుపరి తీసుకోవలసిన నిర్ణయాలపై మాట్లాడటానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ అధికారులందరూ మీటింగ్ కు వస్తున్నట్లు తెలిపారు.
ఈ మీటింగ్ లో డిప్యూటీ కలెక్టర్ సంఘం తో పాటు.. వి.ఆర్.ఓ/ వి.ఆర్.ఏ యూనియన్లు కూడా పాల్గొంటున్నాయి. 16.04.2019 నాడు మధ్యహ్నం 2.30 నిమిషాలకు మూసారామ్ బాగ్, హైదరాబాద్ నందు ఉన్న రెవెన్యూ బిల్డింగ్ లో మీటింగ్ జరుగనుంది. ఇదివరకే సీఎం కేసీఆర్ రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో పలు మార్పులను తీసుకోస్తున్నట్లు తెలిపారు.