![ఆర్టీసీలో క్యాష్ కష్టాలు ఇక దూరం.. నగర బస్సుల్లో క్యూ ఆర్ కోడ్](https://static.v6velugu.com/uploads/2023/06/telangana-rtc-decided-to-go-through-cashless-transactions-in-tsrtc-buses-in-hyderabad_mCd3FHtqwR.jpg)
హైదరాబాద్‌లో ఆర్టీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని బస్సుల్లో క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్ జరిపేందుకు వీలుగా క్యూ ఆర్‌కోడ్ స్కానింగ్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఆర్టీసీ ఆధ్వర్యంలో ఈ అంశంపై కసరత్తు జరుగుతోంది. గత ఏడాదిలోనే క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించాలని అధికారులు భావించారు.
కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంత ఆలస్యమైనట్లు చెప్పారు. జిల్లాలకు తిరిగే సూపర్‌లగ్జరీ బస్సుల్లో క్యాష్తో పాటు ఫోన్‌పే క్యూఆర్ కోడ్ ద్వారా టికెట్ జారీ చేసే ప్రక్రియను అమలు చేశారు. ఇదే విధానం సిటీ బస్సుల్లో అమలు చేయాలన్న ఆలోచనతోనే ఆర్‌టీసీ అధికారులు ఉన్నారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టుకు తిరుగుతున్న పుష్పక్ ఏసీ బస్సుల్లో అమలు చేస్తున్నారు. క్యూఆర్‌కోడ్ స్కాన్ విధానం సిటీ బస్సుల్లో అమల్లోకి వస్తే ప్రయాణికులకు, కండక్టర్లకు చిల్లరతో వచ్చే సమస్యలు తీరనున్నాయి.