తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసులు

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసులు

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కండక్లర్టు, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్లతో యాజమాన్యానికి  ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చారు. 

ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు హైదరాబాద్ బస్ భవన్ లోని ఎండీ కార్యాలయానికి భారీగా తరలివచ్చారు. 

ఎండీ సజ్జనార్ సెలవులో ఉండటంతో ఈడీ (ఆపరేషన్స్) ముని శేఖర్ కు సమ్మె నోటీసు ఇచ్చారు. తమ డిమాండ్లపై యాజమాన్యం స్పందించని పక్షంలో కేంద్ర కార్మిక చట్టం ప్రకారం వచ్చే నెల 9 వ తేదీ నుంచి సమ్మెను మొదలుపెడతామని తెలిపారు. తెలంగాణవ్యాప్తంగా ఆర్టీసీలోని అన్ని బస్సు స్టేషన్లు, డిపోల్లోని కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటారని ఆ నోటీసులో పేర్కొన్నారు.