
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ తెలంగాణ రైతు మహోత్సవంను ప్రారంభించారు శాసన మండలి చైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి, కమిషన్ సభ్యులు కెవిఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, భూమి సునీల్,భవానీ రెడ్డి పాల్గొన్నారు. అగ్రి, హార్టికల్చర్ సొసైటీ ఆధ్వరంలో రైతు మహోత్సవం -2025 కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 11 నుంచి 14 వరకు రైతు మహోత్సవం కొనసాగనుంది.
రైతు మహోత్సవంలో ఆకర్షణీయంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క థీమ్ తో ఒక్కొక్క స్టాల్ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. రైతులకు కావాల్సిన పరికరాలు, ఉత్పత్తులు, సీడ్, ఫర్టిలైజర్ అన్ని స్టాల్స్ లో ఏర్పాటు చేశారు. వ్యవసాయ, ఉద్యానవ శాఖలతోపాటు సెరికల్చర్, ఆయిల్ ఫెడ్ , అనుబంధ శాఖల స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. అన్ని స్టాల్స్ ను పరిశీలించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి, కమిషన్ సభ్యులు కెవిఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, భూమి సునీల్,భవానీ రెడ్డి.
►ALSO READ | పంజాగుట్ట నిమ్స్ లోనూ పార్కింగ్ దందా.. బైక్ లను వదలని మాఫియా