కొనుగోలు కేంద్రాలు వెంటనే పెంచాలి

కొనుగోలు కేంద్రాలు వెంటనే పెంచాలి

బోధన్​,వెలుగు: కొన్ని గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షకార్యదర్శులు మటపతి గంగాధరప్ప, పల్లపు వెంకటేశులు అన్నారు. కొనుగోలు కేంద్రాలు పెంచాలని డిమాండ్​ చేశారు. ఆదివారం సాలూర మండలం సాలంపాడ్​ గ్రామంలో ఆరబెట్టిన వడ్లను పరిశీలించారు. ఈసందర్బంగా వారు మాట్లడుతూ  అకాల వర్షాలు పడే అవకాశం ఉందని ఆరుగాలం కష్టపడి పండించిన రైతు వడ్లు రోడ్డుపాలయ్యే పరిస్థితి ఉందని వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వడ్ల లో  17శాతం తేమ ఉన్న  కొనుగోలు చేయాలని యాసంగి పంట వడ్లు ఎక్కువ ఎండిన నూక అవుతుందని రైతులు తెలిపామన్నారు. 

ప్రభుత్వం రైతులకు ఇంకా బోనస్ ఇవ్వలేదని వెంటనే రైతులకు బోనస్  అందజేయాలని, రైతుబంధు డబ్బులు  విడుదల చేసి రైతుల ఖాతాలో జమ చేయాలన్నారు.   ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచాలని, నకిలీ విత్తనాలు తీసుకొస్తున్న యాజమాన్యాలపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈకార్యక్రమంలో రైతులు వెంకటేశ్వర రెడ్డి, వెంకటేశ్వరరావు, డిజా ఎల్లయ్య, పల్లె హనుమాన్లు, వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.