
హైదరాబాద్, వెలుగు : మాన్‌సూన్ రెగట్టా చాంపియన్‌షిప్‌లో తెలంగాణ సెయిలర్లు సత్తా చాటారు. శనివారం ముగిసిన ఈ టోర్నీలో రాష్ట్రానికి చెందిన గోవర్ధన్ పల్లార, దీక్షిత కొమరవెల్లి అండర్ 16 ఆప్టిమిస్ట్ బాయ్స్, గర్ల్స్ కేటగిరీల్లో గోల్డ్ మెడల్స్ నెగ్గారు.
గోవర్ధన్ ఓవరాల్ మాన్‌సూన్ రెగట్టా ట్రోఫీతో పాటు అత్యంత నిలకడైన సెయిలర్‌గా ఎస్‌హెచ్ బాబు ట్రోఫీ కూడా గెలిచి ట్రిపుల్ ధమాకా మోగించాడు. బాయ్స్ కేటగిరీలో రిజ్వాన్ మహ్మద్ బ్రాంజ్, 420 ఇంటర్నేషనల్ ఓపెన్ కేటగిరీలో తనుజా కామేశ్వర్– గణేష్ పీర్కట్ల గోల్డ్ సొంతం చేసుకున్నారు.