ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువుంటే అనర్హులే

ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువుంటే అనర్హులే
  • పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

హైదరాబాద్, వెలుగు: పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ అమోదించింది. అయితే, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువున్నా అవకాశం కల్పించాలనే ప్రతిపాదనను తిరస్కరించింది. పాత విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించింది.  ఈ ఒక్క ప్రతిపాదన మినహా మిగిలిన వాటిని ఆమోదించింది. అలాగే.. చట్ట సవరణ ద్వారా హైదరాబాద్  ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న 51 గ్రామ పంచాయతీలతోపాటు మిగతా ప్రాంతాల్లోని 80 గ్రామ పంచాయతీలను మున్సిపాల్టీలు, నగరపాలక సంస్థలో విలీనానికి  ఆమోదం లభించింది.