ప్రభుత్వ స్కూళ్లకు ఎర్త్ ఫౌండేషన్ ఒక వరం : చైర్మన్ వెంకటయ్య

ప్రభుత్వ స్కూళ్లకు ఎర్త్  ఫౌండేషన్ ఒక వరం : చైర్మన్ వెంకటయ్య
  • ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య

సిద్దిపేట రూరల్, వెలుగు: ఎర్త్ ఫౌండేషన్ సంస్థ ప్రభుత్వ స్కూళ్లకు ఒక వరం లాంటిదని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. బుధవారం రాత్రి సిద్దిపేట పట్టణంలోని ఇందిరా నగర్ జడ్పీహెచ్ఎస్ స్కూల్ లో ఎర్త్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కలవేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి విద్యా, సాంస్కృతిక, క్రీడ పోటీలను ఆయన జడ్జి చందనతో కలసి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్త్ ఫౌండేషన్ మూడేళ్లుగా జిల్లాలోని అనేక స్కూళ్లను దత్తత తీసుకుని స్టూడెంట్స్​కు విద్య, కళలు, ఆరోగ్యం అంశాల్లో శిక్షణ ఇవ్వడమే కాకుండా జీవితంలో గొప్ప లక్ష్యాలకు చేరుకునేలా కార్యక్రమాలు చేపడుతుందన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం రాజ ప్రభాకర్ రెడ్డి, ఎర్త్ ఫౌండేషన్ డైరెక్టర్ రాజు, వెన్నెల, రాజు, ఆంజనేయులు, కో ఆర్డినేటర్లు నిహారిక, రాకేశ్, ప్రశాంత్, రత్నం, ప్రవీణ్, స్వప్న పాల్గొన్నారు.