Free Civils Coaching:ఫ్రీగా సివిల్స్ కోచింగ్, హాస్టల్ + ఫుడ్ : ఇప్పుడే అప్లై చేసుకోండి

Free Civils Coaching:ఫ్రీగా సివిల్స్ కోచింగ్, హాస్టల్ + ఫుడ్ : ఇప్పుడే అప్లై చేసుకోండి

యూపీఎస్సీ పరీక్షలకు ప్రీపేర్ అయ్యేవాళ్లకు గుడ్ న్యూస్. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీస్ చేసి పోస్టులను భర్తీ చేస్తుంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సివిల్స్ రాయాలనుకునే వారు రోజుకు గంటల తరబడి, నెలలుగా చదవాల్సి ఉంటుంది. IAS, IPS కొలువులు కొట్టాలంటే సొంతంగా చదువుకోవడం కంటే, మెంటర్ షిప్, కోచింగ్ తీసుకోవడం మంచింది. ఈ కోచింగ్ ప్రైవేట్ ఇన్ స్టిట్యూట్స్ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తోంది. కానీ.. తెలంగాణ షెడ్యూల్ క్యాస్ట్ స్టడీ సర్కిల్ ఫ్రీగా హాస్టల్ వసతితో కూడిన కోచింగ్ ఇస్తుంది.

ప్రతి సంవత్సరం 100 అడ్మిషన్లు తీసుకుంటారు. బెస్ట్ ఫ్యాకల్టీ ఇక్కడ టీచ్ చేస్తారు. స్టడీ హాల్, లైబ్రరీ, ఫ్రీగా బుక్స్ కూడా ఇస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. జూలై 31 దరఖాస్తుకు చివరి తేది. జూలై 17 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు తీసుకుంటున్నారు. వార్షిక ఆదాయం రూ.3లక్షల లోపు ఉండి, గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన అభ్యర్థులు దీని అర్హులు. బంజారా హిల్స్ లోని SC స్టడీ సర్కిల్ లో 10నెలలపాటు కోచింగ్ ఇస్తారు. హాస్టల్ సౌకర్యం కల్పిస్తారు. tsstudycircle.co.inలో పూర్తి వివరాలు ఉంటాయి. అదే వెబ్ సైట్ లో ఆన్ లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు.

దీనికి ఎంట్రన్స్ టెస్ట్ లో వచ్చే మార్కులను బట్టి ఎంపిక చేస్తారు. ఆగస్ట్ 11న ఉదయం 10.30 నుంచి 1.30 మధ్యలో ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఈ పరీక్ష యూపీఎస్సీ ప్రీలిమ్స్ తరహాలో ఉంటుంది. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లా కేంద్రాలు ఎగ్జామ్ సెంటర్లలో ఈ టెస్ట్ నిర్వహిస్తారు. ఎంట్రన్స్ టెస్టులో వచ్చిన మార్కులను బట్టి.. రిజర్వేషన్ ప్రకారం కోచింగ్ సీట్లు కేటాయింస్తారు.

పరీక్ష విధానం :

పార్ట్ A లో 100 ఆబ్జెటీవ్ టైప్ జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు.
పార్ట్ Bలో (C SAT) 40 ఆబ్జెటీవ్ టైప్ ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 2  1/2 మార్కులు.
రెండు పేపర్లలో 1/3   నెగిటివ్ మార్కులు ఉంటాయి. మొత్తం ఇంగ్లీష్ మీడియంలో పేపర్ ఉంటుంది. మూడు గంటలు పరీక్ష సమయం.