తెలంగాణ టెట్ (టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్) పరీక్షల సంబంధించి షెడ్యూల్ విడుదలయ్యింది. జనవరి 2 నుంచి 20 వరకు ప్రతిరోజు రెండు సెషన్లలో టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ తెలిపారు. ఉదయం 9.00 గంటల నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్ ఉంటుంది. మధ్యాహ్నం 2.00 నుంచి 4.30 గంటల వరకు రెండవ సెషన్ ఉంటుంది. ఈ సారి టెట్ కు సుమారు 2.75 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు టెట్ కన్వీనర్ తెలిపారు.
టీఎస్ టెట్ – 2025 పరీక్షలో రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు భోధించాలనుకునేవారు పేపర్ 1 పరీక్షకు హాజరవ్వాలి. ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు చెప్పేవారు పేపర్ 2 పరీక్ష రాయాలి. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగరతి వరకు బోధించాలనుకునేవారు పేపర్-1, పేపర్-2 (రెండింటికి) హాజరు కావాలి.
అభ్యర్థులు ప్రణాళిక ప్రకారం టైమ్మేనేజ్మెంట్చేసుకుంటూ ప్రిపేర్ అవ్వాలి. టెట్- పేపర్–-1 రాసే అభ్యర్థులు కంటెంట్ 3 నుంచి 8 తరగతుల వరకు చదవాలి. పేపర్-–-2 రాసే అభ్యర్థులు కంటెంట్ 3 నుంచి 10వ తరగతి స్థాయి వరకు చదవాలి. తెలుగు అకాడమీ పుస్తకాలు చదివి నోట్సు రాసుకోవాలి. సాధన చేయాలి. ప్రైవేట్ పబ్లికేషన్స్ కాకుండా తెలుగు అకాడమీ బుక్స్ చదివి, నోట్స్ రాసుకొని రివిజన్ చేయడం వలన ఎక్కువ స్కోర్ చేయొచ్చు.