- అకడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేసిన విద్యాశాఖ
- జూన్1 నుంచి 11 వరకు బడిబాట కార్యక్రమం
- అక్టోబర్ 2 నుంచి 13 రోజులు దసరా సెలవులు
- డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ వెకేషన్
- జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి హాలిడేస్
- 229 వర్కింగ్ డేస్.. రోజూ ఐదు నిమిషాలు యోగా
- ఏటా రెండు సార్లు విద్యార్థులకు హెల్త్ చెకప్స్
- విద్యార్థుల హాజరు 90% ఉండాల్సిందేనని స్పష్టం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జూన్12 నుంచి స్కూళ్లు రీఓపెన్ కానున్నాయి. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి బడిబాట నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. 11వ తేదీ వరకు 11 రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించనుంది. బడిబాట పూర్తయిన తెల్లారి స్కూళ్లను తెరవనుంది. 2024–25 అకడమిక్ ఇయర్ క్యాలెండర్‌ను శనివారం విద్యాశాఖ రిలీజ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ విద్యా సంవత్సరంలో మొత్తంగా 229 రోజులు వర్కింగ్ డేస్‌గా నిర్ణయించారు. దసరా సెలవులు 13 రోజులు, క్రిస్మస్, సంక్రాంతికి ఐదు రోజుల చొప్పున సెలవులు ఇవ్వనున్నారు. దాంతో పాటు స్కూళ్లలో ప్రతిరోజూ ఐదు నిమిషాలపాటు యోగా, ధ్యానం (మెడిటేషన్) నిర్వహించాలని క్యాలెండర్లో పేర్కొన్నారు. ప్రేయర్(అసెంబ్లీ)కు ముందుగానీ లేదా ప్రేయర్ అయ్యాక క్లాసులోగానీ ఐదు నిమిషాల పాటు విద్యార్థులతో యోగా/మెడిటేషన్ చేయించాలని సూచించారు. ప్రతి నెలా మూడో శనివారం విధిగా నో బ్యాగ్ డేని అమలు చేయాలని, మొత్తంగా విద్యాసంవత్సరంలో పది నో బ్యాగ్ డేలను అమలు చేయాలని అందులో పేర్కొన్నారు. పదో తరగతి సిలబస్‌ను వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ కల్లా పూర్తి చేయాలని, బోర్డు ఎగ్జామ్స్‌కు విద్యార్థులను ప్రిపేర్ చేసేలా రివిజన్, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్‌ను కండక్ట్ చేయాలని సూచించారు. ఒకటి నుంచి తొమ్మిదో క్లాస్ వరకు ఫిబ్రవరి 28 నాటికి సిలబస్‌ను కంప్లీట్ చేసేలా అకాడమిక్ క్యాలెండర్‌ను రూపొందించారు.
ఏటా రెండు సార్లు పిల్లల హెల్త్ ప్రొఫైల్
అన్ని స్కూళ్లూ విద్యార్థులకు రెగ్యులర్‌గా హెల్త్ చెకప్‌లను చేయించాలని అకాడమిక్ క్యాలెండర్లో పేర్కొన్నారు. ప్రైమరీ హెల్త్ సెంటర్ (పీహెచ్సీ)ల నిపుణులతో విద్యార్థులకు చెకప్‌లు చేయించి.. రిఫరల్ కేసులుంటే స్థానిక ఏరియా ఆస్పత్రులకు పంపించాలని సూచించారు. ఏటా రెండుసార్లు పిల్లలకు కచ్చితంగా హెల్త్ చెకప్ చేయించాలని, హెడ్మాస్టర్లు కో ఆర్డినేట్ చేయాలని పేర్కొన్నారు. క్యుములేటివ్ రికార్డ్స్ కింద ఇప్పటికే ప్రింట్ చేసిన విద్యార్థుల హెల్త్ కార్డులను ప్రాపర్‌గా మెయింటెయిన్ చేయాలని అందులో పేర్కొన్నారు.
90 శాతం హాజరు ఉండాల్సిందే
విద్యార్థుల హాజరు శాతం పడిపోకుండా స్కూళ్లు చూసుకోవాలని అకాడమిక్ క్యాలెండర్లో విద్యాశాఖ పేర్కొంది. ప్రతి స్కూల్లోనూ 90 శాతానికిపైగా విద్యార్థుల అటెండెన్స్ ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. విద్యార్థులు స్కూళ్లకు వచ్చేలా తల్లిదండ్రులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, స్థానిక యువత, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేయాలని పేర్కొంది. స్కూల్‌కు తరచూ ఆబ్సెంట్ అవుతున్న విద్యార్థులను గుర్తించి, వారి ఇంటికి వెళ్లి పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడాలని సూచించింది. ప్రతి రోజూ అరగంట పాటు రీడింగ్ యాక్టివిటీకి టైం కేటాయించాలని, స్కూల్ బుక్స్‌తో పాటు స్టోరీ బుక్స్, న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లను చదివించాలని పేర్కొంది.
సెలవులివీ..
- దసరా సెలవులు:
- అక్టోబర్ 2 నుంచి 14 వరకు
- క్రిస్మస్ సెలవులు:
- డిసెంబర్ 23 నుంచి 27 వరకు
- సంక్రాంతి సెలవులు:
- జనవరి 13 నుంచి 17 వరకు
- సమ్మర్ హాలిడేస్ : 24/04/2025 నుంచి 11/06/2025 వరకు
పరీక్షల తేదీలు
- ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ) 1:
- జులై 31 నాటికి పూర్తి చేయాలి
- ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ)2:
- సెప్టెంబర్ 30 నాటికి కంప్లీట్ చేయాలి
- సమ్మెటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ) 1:
- 21/10/2024 నుంచి 28/10/2024 వరకు
- ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ) 3:
- డిసెంబర్17 నాటికి కంప్లీట్చేయాలి
- ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ) 4:
- టెన్త్ క్లాస్‌కు 29/01/2025 వరకు పూర్తి చేయాలి. ఒకటి నుంచి 9వ తరగతి వరకు ఫిబ్రవరి 28 నాటికి పూర్తి చేసి ఉండాలి.
- సమ్మెటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ) 2:
- 09/04/2025 నుంచి 19/04/2025
- టెన్త్ ప్రీ ఫైనల్:
- 28/02/2025 నాటికి
- కంప్లీట్ కావాలి..
- టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్: మార్చి