పదేండ్ల తర్వాత తొలిసారి.. సెక్రటేరియేట్ అసోసియేషన్ ​ఎన్నికలు

పదేండ్ల తర్వాత తొలిసారి.. సెక్రటేరియేట్ అసోసియేషన్ ​ఎన్నికలు
  • పదేండ్ల తర్వాత మొదటిసారి కావడంతో ఉత్కంఠ

హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియేట్​ అసోసియేషన్​ ఎన్నికలు శనివారం జరగనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్  నిర్వహించనున్నారు.  దాదాపు పది రోజుల పాటు అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహించారు. సాధారణ ఎన్నికలను తలపించేలా పోటాపోటీగా హామీలు, దావత్​లు ఇచ్చారు. రాష్ట్రం వచ్చిన పదేండ్ల తరువాత జరుగుతున్న మొదటి ఎన్నికలు కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.  మొత్తం 1,103 మంది సెక్రటేరియేట్​ ఉద్యోగులు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఉద్యోగుల్లో సఖ్యత లేకపోవడంతో ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ (జనరల్), వైస్ ప్రెసిడెంట్  వుమన్, జనరల్ సెక్రెటరీ, అడిషనల్  జనరల్  సెక్రటరీ  ఇలా 11 పోస్టులకు 70 మంది  వరకు పోటీలో ఉన్నారు. ప్రెసిడెంట్​ పోస్టుకు 9 మంది పోటీపడుతున్నారు.