తెలంగాణ సెక్రటేరియట్ : సీఎం ఛాంబర్ అంతస్తు ఎంట్రన్స్ దగ్గర కూలిన పార్టిషన్

తెలంగాణ సెక్రటేరియట్ : సీఎం ఛాంబర్ అంతస్తు ఎంట్రన్స్ దగ్గర కూలిన పార్టిషన్

తెలంగాణ సెక్రటేరియట్ లో పీఓపీ పార్టిషన్ స్వల్పంగా కూలడం కలకలం రేపింది. సెక్రటేరియట్ ఆరో ఫ్లోర్ లో నుంచి పీఓపీ పెచ్చులు స్వల్పంగా కూలి కిందకు పడ్డాయి.  సీఎం చాంబర్ అంతస్తు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కూలిన పీఓపీ పార్టిషన్ కూలింది. 

పీఓపీ పెచ్చులు ఊడి పడటంతో అధికారులు, సెక్యూరిటీ అలర్ట్ అయ్యింది. అక్కడి నుంచి అందరినీ దూరం పంపించారు. అయితే కూలిన పెచ్చులు రామగుండం మార్కెట్ కమిటీ ఛైర్మన్ కారుపై పడ్డాయి. ఆ సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం తప్పింది.

ఇటీవలే నిర్మించిన తెలంగాణ సచివాలయం పీఓపీ కూలడం చర్చనీయాంశంగా మారింది. నిర్మాణ లోపాలు ఉన్నాయా అనే కోణంలో అధికారులు చర్చిస్తున్నారు. 

ALSO READ | కుల గణన సర్వేలో పాల్గొనని వారికి తెలంగాణ సర్కార్ బిగ్ అప్డేట్