సెక్యూరిటీ గార్డులకు ఒకే డ్రెస్​ విధానం అమలు చేయండి : డీఎస్​ రెడ్డి

సెక్యూరిటీ గార్డులకు ఒకే డ్రెస్​ విధానం అమలు చేయండి : డీఎస్​ రెడ్డి

జూబ్లీహిల్స్, వెలుగు: ​రాష్ట్రంలోని సెక్యూరిటీ  ఏజెన్సీల్లో పనిచేస్తున్న గార్డులకు ఒకే డ్రెస్​ విధానం అమలు చేయాలని అసోసియేషన్​ ఆఫ్​ తెలంగాణ చైర్మన్​ డీఎస్​ రెడ్డి, ప్రెసిడెంట్​ శ్రీకాంత్​   ప్రభుత్వాన్ని, పోలీసులను  మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.  ఎవరో చేసిన తప్పుకు అదంరినీ బాధ్యులను చేయడం విచార కరమన్నారు. వారిని  దృష్టిలో పెట్టుకుని  పోలీసు కమిషనర్​ సీవీ ఆనంద్​ సెక్యూరిటీ సంస్థలను హెచ్చరించారన్నారు.  రాష్ట్రంలో ఉన్న సెక్యూరిటీ ఏజన్సీలన్నిటికీ ఒకే డ్రెస్​ కోడ్​ ఉండాలని, బౌన్సర్స్​కు విధి విధానాలు రూపొందించాలని  పోలీసు శాఖను కోరారు.