- లోక్‌సభలో ఎంపీ రఘునందన్ ప్రశ్నకు నితిన్ గడ్కరీ సమాధానం
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో 2014 నుంచి ఇప్పటి వరకు 2,526 కిలోమీటర్ల పొడవు రాష్ట్ర రోడ్లను స్టేట్ హైవేలుగా అప్‌గ్రేడ్ చేశామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. గురువారం లోక్‌సభలో మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. తెలంగాణలో ప్రసుత్తం 30 జాతీయ రహదారులు ఉన్నాయని, ఇవి రాష్ట్రవ్యాప్తంగా 4,926 కిలోమీటర్ల పొడవు విస్తరించి ఉన్నాయని తెలిపారు. గత పదేండ్లలో 2,722 కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారుల నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు.