కులగణనలో తెలంగాణ దేశానికే ఆదర్శం : ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్‌‌ఠాకూర్

కులగణనలో తెలంగాణ దేశానికే ఆదర్శం : ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్‌‌ఠాకూర్

గోదావరిఖని, వెలుగు: కులగణన చేపట్టి తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్‌‌ఠాకూర్​ అన్నారు. గురువారం గోదావరిఖని ప్రెస్‌‌క్లబ్‌‌లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్​ ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వ లేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. అయినా ప్రతిపక్షాల విన్నపాన్ని మన్నించి రాష్ట్రంలో మిగిలిపోయిన 3.56 లక్షల మందికిఈ నెల 16 నుంచి 28 వరకు చేపట్టే సర్వేలో పాల్గొనే అవకాశం కల్పించిందన్నారు.

పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీలు, బడుగుల గురించి మాట్లాడని కేటీఆర్​, కవిత ఇప్పుడు మొసలి కన్నీరు కార్చుతున్నారని విమర్శించారు. అగ్రవర్ణాలకు కొమ్ముకాస్తూ బీజేపీ బీసీలను అణగతొక్కిందన్నారు.  రామగుండం నియోజకవర్గంలో ఇండ్లు కట్టుకోవడానికి ఇసుక ఉచితంగా సప్లై చేయనున్నట్లు చెప్పారు. బూడిదను కూడా ఉచితంగా ఇవ్వనున్నామని చెప్పారు. సమావేశంలో మాజీ మేయర్​ అనిల్​కుమార్, మహాంకాళి స్వామి, కాల్వ లింగస్వామి, తిప్పారపు శ్రీనివాస్​, సుజాత, ప్రకాశ్​ పాల్గొన్నారు.