వాటర్ ​రీసోర్స్ రికవరీ సెల్ ఏర్పాటు

 వాటర్ ​రీసోర్స్ రికవరీ సెల్ ఏర్పాటు
  • జల్​హీ అమృత్​ పథకంలోభాగంగా ఏర్పాటు

హైదరాబాద్​సిటీ, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ‘జల్​హీ అమృత్’ పథకంలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో వాటర్​ రీసోర్స్​ రికవరీ సెల్​ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా తెలంగాణలోనూ ప్రత్యేకంగా ఒక సెల్​ను ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ అర్బన్​ఫైనాన్స్​ అండ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ డెవలప్​మెంట్ కార్పొరేషన్– అమృత్ 2.0 ఆధ్వర్యంలో ఈ సెల్ పని చేస్తుందని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర స్థాయి వాటర్ రీసోర్స్​రి కవరీ సెల్​కు చైర్మన్​గా మెట్రోవాటర్​బోర్డు ఎండీ వ్యవహరిస్తారు.

కో చైర్మన్​గా గవర్నమెంట్​డిప్యూటీ సెక్రెటరీ(అర్బన్​లోకల్​బాడీస్, సీఎస్ఎస్), సభ్యులుగా కమిషనర్​ అండ్​ డైరెక్టర్​ మున్సిపల్​ అడ్మినిస్ట్రేషన్, ఇరిగేషన్​/అగ్రికల్చర్​ నుంచి ఒకరు, విద్యుత్​శాఖ నుంచి ఒకరు, పబ్లిక్​హెల్త్​ ఇంజనీర్​ఇన్​చీఫ్, పరిశ్రమల శాఖ నుంచి ఒకరు, పొల్యూషన్​ కంట్రోల్​బోర్డు నుంచి ఒకరు సభ్యులుగా ఉంటారు. టీయూఎఫ్​ఐడీసీ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్ మెంబర్ కన్వీనర్​గా కొనసాగుతారు. ఈ సెల్​అర్బన్​ వాటర్​ ట్రీట్​మెంట్​ప్లాంట్లను ప్రోత్సహిస్తుంది. 

పనితీరును, పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా వాటి నిర్వహణను పరిశీలిస్తుంది. ఫీల్డ్ విజిట్​చేసి శుద్ధి చేసిన నీటిని నాణ్యతను, అందులోని బయోసాలిడ్స్​పరిశీలించి, ప్రతి మూడు నెలలకోసారి నివేదికను సిద్ధం చేసి కేంద్ర హౌసింగ్​అండ్​ అర్బన్​ వ్యవహారాల శాఖకు సమర్పిస్తుంది.