ఎర్రకోట వద్ద ఆకట్టుకున్న తెలంగాణ శకటం

ఎర్రకోట వద్ద ఆకట్టుకున్న తెలంగాణ శకటం
  • రాణి రుద్రమ స్ఫూర్తితో ప్రజా పాలన : రెసిడెంట్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ డా. గౌరవ్‌‌‌‌ ఉప్పల్‌‌‌‌

న్యూ ఢిల్లీ, వెలుగు: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారత్‌‌‌‌ పర్వ్‌‌‌‌లో తెలంగాణ శకటం, తెలంగాణ టూరిజం పెవిలియన్‌‌‌‌, ఫుడ్‌‌‌‌ కోర్ట్‌‌‌‌ ఢిల్లీ వాసులను ఆకట్టుకున్నాయి. రాజ్ గోండ్ గిరిజనుల గుస్సాడి నృత్యాలు హైలెట్ గా నిలిచాయి. ఈ సందర్భంగా రెసిడెంట్ కమిషనర్ డా. గౌరవ్ ఉప్పల్ మాట్లాడారు. తెలంగాణ సంస్కృతి, కళలు, వారసత్వంతో రాష్ట్రం సుస్థిర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని చెప్పారు.

 రామప్పను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిందని పేర్కొన్నారు. కాకతీయుల గొప్ప సాంస్కృతిక వారసత్వం, రాణి రుద్రమ స్ఫూర్తిగా తెలంగాణలో ప్రజా పాలన కొనసాగుతున్నట్టుగా వివరించారు. రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రదేశాలతో కూడిన రాష్ట్ర శకటం సందర్శకులను అమితంగా ఆకట్టుకుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలంగాణ భవన్ అధికారులు పాల్గొన్నారు.