- స్థానిక నేతలు, అధికారులు, గ్రామ పెద్దలు అందర్నీ భాగస్వామ్యం చేయాలి
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
వరంగల్: విద్య, వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని.. దీని కోసమే ప్రతిష్టాత్మకంగా మన ఊరు మన బడి,మన బస్తీ.. మన బడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. సర్కారు స్కూళ్ల పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణపై ఇవాళ ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ప్రతి పాఠశాల లో నిరంతరం నీరు, మరుగుదొడ్లు, విద్యుత్, మంచినీరు, ఫర్నీచర్, ప్రహరీ గోడలు, వంట గది, అదనపు గదుల, మరమ్మతులు, డిజిటల్ వంటి అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. ఆధునిక వసతులు ఉండాలని, అలాగే పాత భవనాలను అధునికరించాలన్నారు. వనరుల నిర్వహణకు కమిటీ వేసి, నిధుల నిర్వహణ కోసం ప్రత్యేక ఖాతాను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రజా ప్రతినిధులను, అధికారులు, గ్రామపెద్దలను తల్లిదండ్రులను బడుల బాగుకోసం బాగస్వామ్యం చేయాలన్నారు. ఎన్ఆర్ఐలను, దాతలను స్కూల్స్ దత్తత తీసుకునేలా ప్రోత్సాహించాలని, విద్యార్థుల సంఖ్య ను గణనీయంగా పెంచడంతోపాటు మంచి వాతావరణంలో నాణ్యమైన విద్య బోధన జరగాలని సూచించారు.
ఇవి కూడా చదవండి
ఉక్రెయిన్‌లో భారతీయుల కోసం టీబీజేపీ టోల్ ఫ్రీ నెంబర్