ఖైరతాబాద్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణనను ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా కులగణనను చేపట్టాలని కేంద్రప్రభుత్వాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో డిసెంబర్ 5, 6 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టనున్న ఆందోళన కార్యక్రమ పోస్టర్ ను ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఈబీసీ రిజర్వేషన్ల పేరుతో ప్రధాని మోదీ అగ్రకులాల వారికే ఉద్యోగాలను కట్టబెడు తున్నారని విమర్శించారు. దీంతో రిజర్వేషన్లు ఉన్న బీసీలకు అన్యా యం జరుగుతుందని పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాల్లో కులగణనకు అనుకూలంగా వ్యవహరించకుంటే బీజేపీని బొంద పెడుతామని హెచ్చరించారు. బీజేపీ నేతలు మూసీ వద్ద నిద్ర పోవడం కాదని, మూసీ వాసుల బతుకులు మారాలంటే కులగణన జరగాలని సూచించారు.