పిలిస్తే పలుకుత లేరు.. అరిచినా ఎలాంటి స్పందన లేదు: ఎస్ఎల్బీసీ ఘటనపై మంత్రి జూపల్లి

పిలిస్తే పలుకుత లేరు.. అరిచినా ఎలాంటి స్పందన లేదు: ఎస్ఎల్బీసీ ఘటనపై మంత్రి జూపల్లి

హైదరాబాద్: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగం కూలిన ఘటనలో 8 మంది ఆచూకీ లభించలేదు. అయితే సహాయక చర్యలు మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వారిని ఎలాగైనా ప్రాణాలతో బయటికి రప్పించేందుకు ర్యాట్ హోల్ మైనర్స్ ను సైతం రప్పించింది ప్రభుత్వం. ఘటనపై మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. తాను చివర వరకు వెళ్లానని అన్నారు. తాను వెళ్లిన ప్రదేశం ప్రమాద స్థలానికి 50 మీటర్ల దూరం వరకు ఉంటుదని చెప్పారు. 

ఫొటోలు తీసినప్పుడు సొరంతం చివరి  కనిపించిందని అన్నారు. సొరంగం వ్యాసం ఉన్న  30 అడుగులు ఉంటుందని, అందులో 25 మీటర్ల మేర బురద పేరుకు పోయిందని అన్నారు. తాము వారి పేర్లను పిలిచినా పలుకడం లేదని అన్నారు. బిగ్గరగా అరిచినా ఎలాంటి స్పందన  రావడం లేదని చెప్పారు. పరిస్థితిని చూస్తే వాళ్లు బతికే అవకాశాలు చాలా తక్కువని చెప్పారు.

ALSO READ : హైదరాబాద్లో ఒకేసారి రెండు చోట్ల భారీ అగ్ని ప్రమాదాలు.. భయాందోళనలతో పరుగులు తీసిన ప్రజలు

శనివారం ఉదయం కూలిపోయిన టన్నెల్ లో ఎనిమిది మంది చిక్కుకున్నారు. వారితో ఇద్దరు ఇంజినీర్లు, ఇద్దరు ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారు.   ప్రమాదం జరిగిన తర్వాత  కొన్ని వందల టన్నుల బరువున్న టన్నెల్ బోరింగ్ మెషిన్  దాదాపు 200 మీటర్ల దూరం కొట్టుకుపోయిందని,  నీరు ఉప్పొంగడం వల్ల ఇది జరిగిందని అధికారులు చెబుతున్నారు. వాళ్లను తీసుకు రావడానికి కనీసం మూడు నాలుగు రోజులు పడుతుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సహాయక చర్యల్లో పాల్గొంటున్న పర్యవేక్షక అధికారి ఒకరు తెలిపారు.