చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్ష సాధింపే : స్పీకర్ పోచారం

కామారెడ్డి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడం అప్రజాస్వామికమని తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యేనని ఆయన పేర్కొన్నారు. ఇవాళ కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం సంభాపూర్, భైరాపూర్ గ్రామాల్లో ఆయన పర్యటించారు. 

కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పోచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సంభాపూర్ గ్రామ ప్రజలు వచ్చే ఎన్నికల్లో పోచారం శ్రీనివాసరెడ్డికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.